తెలంగాణ

telangana

న్యూలుక్​లో ఛత్తీస్​గఢ్​ సీఎం.. ధూమ్​ స్టైల్​లో బైక్ రైడింగ్​..

By

Published : Mar 3, 2022, 4:35 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

Bhupesh Baghel Bike Riding: ఛత్తీస్​గఢ్​ సీఎం భూపేశ్​ బఘేల్ న్యూలుక్​లో కనిపించారు. ధూమ్​ స్టైల్​లో బైక్​ రైడ్ చేస్తూ అభిమానులను అలరించారు. రాష్ట్రంలో 'నేషనల్​ సూపర్​ క్రాస్​ బైక్​ రేసింగ్​ ఛాంపియన్స్​ 2022' జరగనున్న నేపథ్యంలో స్పోర్ట్స్​ బైక్​ను నడిపారు. సీఎం ధైర్యంగా రైడింగ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది. రేసింగ్ ఛాంపియన్స్ మార్చి 6న ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మార్చి 5నుంచి ప్రాక్టీస్​ రైడింగ్ నిర్వహించనున్నారు. ఈ ఛాంపియన్స్​లో పాల్గొనడానికి విదేశాల నుంచి ఆటగాళ్లు రాయ్​పుర్​కు వచ్చారు. బంగమట్టిపై జరిగే ఈ రేసింగ్​లో చిన్నపిల్లలు కూడా పాల్గొననున్నారు. రాష్ట్రంలో అడ్వెంచర్ స్పోర్ట్స్, టూరిజంను ప్రోత్సహించడానికి బుధపరా అవుట్‌డోర్ స్టేడియంలో మోటార్ స్పోర్ట్స్ అసోసియేషన్ టోర్నమెంట్​ను ప్రభుత్వం నిర్వహించనుంది.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details