fashion show : పట్టుచీరల్లో చందమామలు.. హంసనడకలతో అదరహో.. - తెలంగాణ వార్తలు
National Silk Expo hyderabad : పట్టుచీరల్లో అమ్మాయిలు మెరిసిపోయారు. ర్యాంప్‌పై అందచందాలతో ఆకట్టుకున్నారు. ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఆధ్వర్యంలో హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో నేషనల్ సిల్క్ ఎక్స్‌ఫో పేరిట ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన పలువురు మోడల్స్ విభిన్న రకాలైన చీరలను ప్రదర్శించారు. 12 రోజలపాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. చీరల గొప్పదనం నేటితరానికి తెలియజేయడానికి ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 16 రాష్ట్రాలకు చెందిన పట్టు, చేనేత కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు. వివిధ రకాల పట్టుచీరలు ధరించిన మోడల్స్.. ర్యాంప్‌పై హంసనడకలతో అదరహో అనిపించారు.