వేదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం... డ్రోన్ దృశ్యాలు - krishna river
ఏపీలోని కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద నిండుకుండలా కృష్ణానది ప్రవహిస్తోంది. జిల్లాలో పలు మండలాల్లో సాగు, తాగు నీటి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. కృష్ణ్మ పరవళ్లతో ఆలయం వద్ద ప్రకృతి అందాలు ఎంతో ఆహ్లాదంగా చూపరులను ఆకట్టుకుంటున్నాయి. డ్రోన్ షాట్లో చుట్టుపక్కల ప్రాంతం మరింత అందంగా కనిపిస్తోంది.. ఓసారి మీరు చూసేయండి!