ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యం.. బిడ్డతో సహా మ్యాన్‌హోల్‌లో పడి.. - woman along with child fell into sewer
హరియాణాలో నిర్లక్ష్యంతో ఓ మహిళ తన ప్రాణాలు, తన బిడ్డ ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చింది. ఫరీదాబాద్‌లోని జవహర్ కాలనీలో.. ఓ మహిళ బిడ్డను ఎత్తుకుని ఫోన్ మాట్లాడుతూ కాలినడకన బయటకు వెళ్లింది. కొద్ది దూరం నడిచిన తర్వాత ఆమెకు ఓ స్టాండ్ ఎదురైంది. ఫోన్లో మాట్లాడుతుండటం వల్ల స్టాండ్ వెనక.. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌ను ఆమె గుర్తించలేదు. అలానే ముందుకు నడవడం వల్ల బిడ్డతో సహా మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. అక్కడే ఉన్న వారు పరుగులు తీసి వారిద్దరినీ కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. గత కొంతకాలంగా.. మ్యాన్‌హోల్ మూసివేయమని స్థానికులు అధికారులను వేడుకుంటున్నారు. కానీ అధికారులు పట్టించుకోవడం లేదని వారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.