వైరల్: 11 అడుగుల తాచుపాముకు ముద్దు - Cobra viral news in Karnataka
పాము కనిపిస్తేనే అమ్మో అని భయపడి ఆమడ దూరం పరుగెడతారు చాలామంది. కానీ.. కర్ణాటక చిక్కమంగళూరుకు చెందిన అర్జున్ ఇందుకు భిన్నం. పాములతో ఆడుకోవడం అలవాటు చేసుకున్న అర్జున్.. ఏకంగా వాటిని ముద్దాడుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల 11 అడుగుల ఓ తాచుపామును కళ్లలోకి కళ్లుపెట్టి చూస్తూ.. అలవోకగా ముద్దాడాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.