తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఎలక్ట్రీషియన్​ వింత ప్రవర్తన- ట్రాన్స్​ఫార్మర్​కు మద్యంతో అభిషేకం

By

Published : Oct 14, 2021, 2:42 PM IST

విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్​ మరమ్మతు చేసేందుకు వచ్చిన ఓ ఎలక్ట్రీషియన్​ వింతగా ప్రవర్తించాడు. ట్రాన్స్​ఫార్మర్​కు అగరబత్తీలు వెలిగించి, లడ్డూలు, పువ్వులతో పూజలు చేశాడు. అంతేగాక.. ట్రాన్స్​ఫార్మర్​పైకి ఎక్కి, దానిపై మద్యం పోశాడు. ఈ సంఘటన బిహార్​ సారణ్​ జిల్లా సాలెంపుర్ పోఖాడాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. దాంతో అధికారులు చర్యలు చేపట్టారు. సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. అతనిపై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details