'నన్ను చంపేయండి.. కానీ నేను టీకా వేసుకోను' - ఇండోర్ వృద్ధుడు టీకా
oldman refuses to get corona vaccine: కరోనాపై పోరులో టీకాలు సంజీవనిగా పని చేస్తాయని శాస్త్రవేత్తలు ఎన్నోసార్లు చెప్పారు. ప్రజలు తరలివచ్చి టీకాలు వేసుకోవాలని ప్రభుత్వాలూ పిలుపునిస్తున్నాయి. టీకాపై అపోహలు తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయినప్పటికీ దేశంలోని మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు టీకాపై అపోహలు వీడటం లేదు. తాజాగా మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలోని రాలామండల్ గ్రామంలో ఇలాంటి ఘటనే జరిగింది. టీకా వేసుకోనని ఓ వృద్ధుడు మంకుపట్టు పట్టాడు. 'టీకా వేసుకున్న తర్వాత నా భార్య 15రోజులు మంచం మీదే ఉంది. ఇప్పుడు నేను మంచం మీద పడితే మాకు తిండి పెట్టేవారు ఎవరు ఉన్నారు? నేను టీకా వేసుకోను. అవసరమైతే నన్ను ఉరి తీయండి, చంపేయాండి. కానీ నేను టీకా వేసుకోను. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్లు వచ్చి చెప్పినా, నేను ఎవరి మాటా వినను,' అని మంకుపట్టు పట్టాడు. టీకా వేసుకోవాలని ఆయన్ని ఒప్పించేందుకు ఆరోగ్య సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అయినా ఫలితం దక్కలేదు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
Last Updated : Dec 6, 2021, 11:47 AM IST