కాఫీ కప్పులు.. సైకత శిల్పాలు.. అంతా లతాజీ మయం! - లతా మంగేష్కర్ కాఫీ కప్పులో చిత్రం
Tribute to Lata mangeshkar: ప్రముఖ గాయని, భారతరత్న గ్రహీత లతా మంగేష్కర్ మృతి పట్ల దేశంలోని కళాకారులు వినూత్నంగా నివాళులు అర్పించారు. ఒడిశాకు చెందిన ప్రముఖ కళాకారులు సుదర్శన్ పట్నాయక్, మానస్ సాహు.. సైకత కళాఖండాలను రూపొందించారు. పూరీ తీరంలో సుదర్శన్ పట్నాయక్.. సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయగా.. శాండ్ యానిమేషన్‌తో మానస్ సాహు గాయని మృతికి సంఘీభావం ప్రకటించారు. కర్ణాటక ధార్వాడ్‌కు చెందిన కళాకారుడు మంజునాథ్ హీరేమఠ్.. కారు అద్దాలపై పడిన ధూళితో గాయని రూపాన్ని తీర్చిదిద్దారు. రాజస్థాన్ జోధ్‌పుర్‌కు చెందిన యువతి.. కాఫీ కప్పులో చూడచక్కని లతా మంగేష్కర్ చిత్రాన్ని 40 సెకన్లలోనే వేసి వావ్ అనిపించారు.