ప్రయాణికుల బస్సును వెంబడించిన గజరాజు - tamilanadu latest news
తమిళనాడులో దట్టమైన సత్యమంగళం అటవీ ప్రాంతం గుండా బస్సు ప్రయాణిస్తున్నప్పుడు.. ఓ ఏనుగు వెంటాడింది. 30 మంది ప్రయాణికులతో బస్సు ధలావాడి నుంచి తలమలైకి వెళ్తున్న క్రమంలో.. మహారాజాపురం సమీపంలో రోడ్డుకు అడ్డంగా ఏనుగుల గుంపు ఉంది. దీనిని గమనించిన బస్సు డ్రైవర్... గజరాజులు వెళ్లేంత వరకు వేచి చూసి అనంతరం బస్సు ముందుకు నడిపాడు. ఈ సమయంలో ఓ ఏనుగు అకస్మాత్తుగా బస్సును వెంబడించింది. గమనించిన డ్రైవర్ బస్సును వేగంగా పోనివ్వడం వల్ల ప్రమాదం తప్పింది.