బట్టలు ఇస్త్రీ చేసి ఓట్లు అభ్యర్థించిన మంత్రి - తమిళనాడు రాజకీయ వార్తలు
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థులు వినూత్న ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. రాయపురం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన తమిళనాడు మంత్రి, ఏఐఏడీఎంకే అభ్యర్థి డీ.జయకుమార్ బట్టలు ఇస్త్రీ చేశారు. మరోసారి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు.