ఇంట్లోకి దూరిన 'డేంజర్' కోబ్రా- విషం ఉమ్మిందంటే అంతే! - విషాన్ని ఉమ్మే కోబ్రా
ఉత్తరాఖండ్‌లోని నైనితాల్ జిల్లా రామ్‌నగర్ ప్రాంతంలో (Spitting Cobra in India) అరుదైన కోబ్రాను గుర్తించారు స్థానికులు. ఈ కోబ్రా.. విషాన్ని ఉమ్మే లక్షణం ఉన్న రకానికి చెందిన పాము. శాంతీకుంజ్ స్ట్రీట్‌లోని ఓ వ్యక్తి నివాసంలో ఈ సర్పాన్ని గుర్తించిన స్థానికులు.. వైల్డ్ వెల్ఫేర్ సొసైటీకి సమాచారం ఇచ్చారు. సొసైటీ సిబ్బంది ఆ కోబ్రాను జాగ్రత్తగా పట్టుకుని సమీపాన ఉన్న అడవిలో విడిచిపెట్టారు. మోనాకల్డ్ కోబ్రాలుగా పిలిచే (Spitting Cobra in India) ఈ విషసర్పాలు ఆగ్నేయ ఆసియాలోనే ఎక్కువగా కనిపిస్తాయని.. ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు విషాన్ని ఉమ్ముతాయని వెల్లడించారు.