'100' స్పీడ్‌తో బలంగా ఢీకొన్న రేస్ బైక్‌లు- భయానక దృశ్యాలు - బైక్ రేసింగ్‌లో ప్రమాదం
Bike Accident: కేరళ కొల్లాం జిల్లాలో యువకులు సరదాగా చేసిన బైక్ రేసింగ్ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అతి వేగంలో సెల్ఫీ తీసుకుంటూ.. ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొట్టాడు ఓ రైడర్. జిల్లాలోని కొట్టరకట్ట ప్రాంతంలోని ఎంసీ రోడ్లో నంబర్ ప్లేట్లు లేని నాలుగు బైక్‌లపై నలుగురు యువకులు రేసింగ్ మొదలుపెట్టారు. అందులో ఓ రైడర్ అతి వేగంలో వెళ్తూ సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఎదురుగా మరో వ్యక్తి బైక్‌పై వచ్చాడు. దీంతో రెండు ద్విచక్రవాహనాలు బలంగా ఢీకొన్నాయి. ఈ భయానక దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బైక్‌లు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నట్లు అంచనా వేశారు.