వరదల్లో చిక్కిన చిన్నారి ఖడ్గమృగాన్ని కాపాడారిలా.. - assam floods
అసోంలో భారీగా కురిసిన వర్షాలతో.. వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రపంచంలోనే ఎక్కువ సంఖ్యలో ఖడ్గమృగాలున్న ప్రఖ్యాత కాజీరంగా జాతీయ వనం కూడా 70 శాతం నీట మునిగింది. జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. తాజాగా వరద నీటిలో చిక్కుకున్న ఓ చిన్నారి ఖడ్గమృగాన్ని అటవీ అధికారులు చాకచక్యంగా కాపాడారు. ఖడ్గమృగం బెదిరిపోకుండా మత్తుమందు ఇచ్చి.. ఆ తర్వాత సురక్షిత ప్రాంతానికి తరలించారు.