బస్సు కిందకు దూసుకెళ్లిన బైక్... యువకుడు మృతి - biker died after hitting bus
మహారాష్ట్ర పుణెలో ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. నగరంలోని తిలక్ రోడ్డులో ఓ ఆటో.. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ పరిణామంతో బైక్పై అదుపు కోల్పోయాడు వాహన చోదకుడు. వాహనాన్ని నియంత్రించలేక ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు. బైక్ అమాంతం బస్సు కింది భాగంలోకి దూసుకుపోయింది. తీవ్రగాయాలయిన బాధితుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. బాధితుడిని 24 ఏళ్ల తుకారాంగా గుర్తించారు. ప్రమాద దృశ్యాలు దగ్గర్లోని సీసీటీవిలో రికార్డయ్యాయి.
Last Updated : Feb 28, 2020, 11:42 PM IST