మెరిసిపోతున్న అయోధ్య.. దీపోత్సవానికి సర్వం సిద్ధం - ఉత్తర్‌ప్రదేశ్‌లో దీపావళి సంబరాలు
అయోధ్యలో దీపావళికి ముందే (Deepotsav 2021 Ayodhya) పండుగ వాతావరణం నెలకొంది. ఏటా.. దీపావళికి ఒక్కరోజు ముందు నిర్వహించే దీపోత్సవ్ కోసం.. ఆయోధ్య సిద్ధమవుతోంది. విద్యుత్ దీపాల కాంతులతో అయోధ్య వెలిగిపోతుంది. లక్షల దీపాలతో ఆయోధ్యను అలంకరించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీపోత్సవ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొననున్నారు. 2017లో ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన భాజపా.. అప్పటి నుంచి ఏటా దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తోంది.