డోలీలో గర్భిణీ- 6 కిలోమీటర్లు మోస్తూ ఆస్పత్రికి.. - గర్భిణీ
సరైన రోడ్డు రవాణా మార్గం లేక ఓ గర్భిణీని డోలీ కట్టి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటన తమిళనాడు వేలూర్లోని జటాయన్కొల్లాయ్లో జరిగింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న అనిత అనే మహిళను డోలీలో ఎక్కించుకొని ఆరు కి.మీ. మోసుకెళ్లారు ఆమె బంధువులు, గ్రామస్థులు. అక్కడి నుంచి ఉస్సూర్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అనిత.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే.. తమ ఊరి సమీపంలో ఆస్పత్రి కట్టాలని, రోడ్డు సౌకర్యాలు మెరుగుపర్చాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
Last Updated : Dec 16, 2021, 10:58 PM IST