అసోం వరదలతో వన్యప్రాణుల ఇక్కట్లు
ఈశాన్య రాష్ట్రం అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉద్యానాల్లోని వన్యప్రాణుల జీవనం అగమ్యగోచరంగా మారింది. మొరిగావున్ జిల్లాలోని పోబీటోరా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం నిండా వరదనీరు చేరింది. ఎటు చూసినా వరదనీటితో ఉండటం వల్ల జంతువుల మనుగడపై తీవ్ర ప్రభావం పడింది. ఆహారం దొరికే పరిస్థితులూ లేవు. బురద నీటితో అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్నాయి.