పెట్రోల్ కావాలంటే క్యూలో గంటల కొద్ది నిలబడాల్సిందే
మహారాష్ట్ర కొల్హాపుర్లో 5 రోజులుగా కురుస్తున్న వర్షాలు శాంతించటం వల్ల ప్రజలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. తెరిచిన కొద్దీ దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. ఇక పెట్రోల్ బంకుల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. జిల్లాలోని ఇచల్కరాంజీ పట్టణంలో పెట్రోల్ కోసం వందల మంది లైన్లలో బారులు తీరారు. స్థానికులతో పాటు గ్రామాల నుంచి ప్రజలు రావటం వల్ల పెట్రోల్ కావాలంటే గంటకుపైగా సమయం పడుతోంది.