ఆత్మీయత కలయికగా 'ఈద్ ఉల్ ఫితర్' - ఈద్ ఉల్ ఫితర్
రంజాన్ పండుగ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లోని అన్ని మసీదులు, ఈద్గాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. ముస్లింలందరూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. అత్మీయ కలయికల అనుబంధంతో, భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటున్నారు ముస్లింలు. దిల్లీ జామా మసీదు, భోపాల్ ఈద్గా మసీదు, యూపీ అలీగఢ్‌లోని షా జమాల్ మసీదులు రంగురంగుల అలంకరణలతో ముస్తాబయ్యాయి. పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణంతో కోలాహలం నెలకొంది.