భారీ వర్షాలకు కుప్పకూలిన పంచాయతీ భవనం - భారీ వర్షాలు
హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు పెరిగిపోయాయి. చంబా జిల్లా.. మెహ్లా బ్లాక్ బద్లా గ్రామంలోని పంచాయతీ భవనం కొండచరియలు విరిగిపడటం వల్ల పేకమేడలా కుప్పకూలిపోయింది. ఆ భవనం కొండప్రాంతంలో గట్టుకు అంచున ఉండటం వల్ల కూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.