సీఎంకు చేదు అనుభవం.. ఉల్లితో ప్రజలు దాడి - నితీశ్ కుమార్‌పై ఉల్లిదాడి
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. మూడోదఫా ఎన్నికల ప్రచారంలో భాగంగా.. హర్లఖి మధుబానిలో ఏర్పాటు చేసిన ఓ ర్యాలీలో నితీశ్‌పై కొందరు దుండగులు ఉల్లిపాయలు, రాళ్లను విసిరారు. నితీశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ ఘటనలో నితీశ్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది నితీశ్‌కు భద్రత కల్పించారు. ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని నితీశ్ అన్నారు.