పూరీ: వైభవంగా జగన్నాథుని రథయాత్ర - భక్తులు
ఒడిశా అధ్యాత్మిక నగరి పూరీలో జగన్నాథ రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. సుభద్రా సమేత జగన్నాథ, బలభద్ర స్వాములను రథం మీద ప్రతిష్టించారు. ఈ వైభవాన్ని చూడటానికి దేశ, విదేశాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. 9 రోజుల ఈ వేడుకలో ఈ ముగ్గురు దేవతలు గుండీచామాత ఆలయానికి వెళతారు. గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన తరువాత స్వామివారు దశమి రోజు తిరుగు ప్రయాణమవుతారు. ద్వాదశి రోజున దేవతలను రత్న సింహాసనంపై నిలుపుతారు. దీనితో యాత్ర పరిసమాప్తమవుతుంది.