బీఎస్ఎఫ్ జవాన్ల దీపావళి వేడుకలు - crackers
దేశమంతటా దీపావళి సంబరాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని ఆర్ఎస్ పురాలో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) జవాన్లు బాణసంచా కాల్చి వేడుకలు చేసుకున్నారు. కొవ్వొత్తులు వెలిగించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారత్ మాతా కీ జై నినాదాలు చేసి దేశభక్తిని చాటారు.