మూడంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు - delhi latest news
దిల్లీ గాంధీ నగర్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ మూడంతస్తుల భవనంలోని దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు అంతటా విస్తరించాయి. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సహాయక చర్యలు చేపట్టారు. 20కిపైగా ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పారు.