కన్నులపండువగా పంచమ రథోత్సవం
కర్ణాటకలోని శ్రీకేతేశ్వరస్వామి రథోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. నంజంగుడ్ నగరానికి 24 కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. అందువల్ల దీనిని నంజంగుడ్ రథోత్సవాలు అని కూడా పిలుస్తారు. పంచమ రథోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆలయ వీధుల్లో ఐదు రథాల ఊరేగింపు వైభవంగా జరిగింది. సుమారు 90 అడుగుల ఎత్తు ఉండే శ్రీకేతేశ్వర స్వామి రథాన్ని కన్నులపండువగా అలంకరించారు.