మరోసారి ముంబయిని ముంచెత్తిన భారీ వర్షాలు - mumbai
ముంబయి నగరాన్ని వర్షాలు మరోసారి ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాలు నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. రహదారులు, రైలుమార్గాలు జలమయమయ్యాయి. రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొంకన్ ప్రాంతంలో మరో 24 గంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. విదర్భా, మరాఠ్వాడా, దక్షిణ మధ్యమాహ్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.