రూ.10 పందెం కోసం ప్రాణాల మీదకు..! - వైరల్ వీడియో మధ్యప్రదేశ్ వరదలు
మధ్యప్రదేశ్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో నదులు, వాగులు పొంగిపొర్లి ప్రమాదకరంగా మారాయి. వాగు దాటడం ప్రమాదం అని హెచ్చరిస్తున్నా కొందరు దుస్సాహసాలకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సతనా జిల్లా పరసమానియా గ్రామంలో రూ.10 పందెం కోసం దుస్సాహసానికి ఒడిగట్టిన యువకులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదరకరంగా ప్రవహిస్తున్న వాగును బైక్పై దాటేందుకు యత్నించగా.. ఆ వాహనం వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీంతో సూమారు రూ.70వేలు విలువ చేసే బైక్ నీటిపాలైంది. అదృష్టవశాత్తు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు.