చావు అంచులదాకా పోయాడు..మొత్తానికి బతికాడు - నిర్లక్ష్యం
నిర్లక్ష్యంగా రైల్వే ట్రాక్‌ను దాటేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి.... చావు అంచులదాకా వెళ్లి బతికిబయటపడ్డాడు. మహారాష్ట్ర ఆసన్‌గావ్ రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫాం పైనుంచి ట్రాక్ మీదకు దిగి రెండవ వైపుకు వెళ్లడానికి ప్రయత్నించాడు. ఇంతలో రైలు దూసుకొచ్చింది. ప్లాట్‌ఫాం.. రైలు మధ్య చిక్కుకున్న అతను అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు. మంగళవారం జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.