వైరల్: ఆస్పత్రిలో నలుగురు మహిళల ఫైటింగ్ - ఆస్పత్రిలో ఘర్షణ
మధ్యప్రదేశ్ హోశంగాబాద్ జిల్లా ఆస్పత్రిలో బుధవారం మధ్యాహ్నం నలుగురు మహిళలు గందరగోళం సృష్టించారు. ఒకరితో ఒకరు బాహాబాహీకి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఘర్షణకు దిగిన మహిళల్లో ఇద్దరు ఏఎన్ఎంలు కాగా.. మరొకరు సీఎంహెచ్ఓ కార్యాలయంలో పని చేసే ఉద్యోగిగా తెలుస్తోంది.