మేడిన్ ఇండియా హావిట్జర్ల ట్రయల్స్
భారత్‌లో తయారు చేసిన అధునాతన హావిట్జర్లను అధికారులు పరీక్షించారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో వీటిపై పరీక్షలు నిర్వహించారు. సాధారణ, ఏటవాలు ఉపరితలాలపై నడిపించారు. ఆర్టిలరీ ఆయుధ వ్యవస్థతో కూడిన వీటిని డీఆర్డీఓ అభివృద్ధి చేసింది. త్వరలో సైన్యానికి అందించనుంది. 50 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఇది సులభంగా ఛేదిస్తుంది.