వాటర్ ట్యాంక్లో పడిన చిరుత.. రక్షించిన అధికారులు - చిరుతను రక్షించిన అధికారులు
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఓ చిరుత అనుకోకుండా వాటర్ ట్యాంక్లో పడింది. పైకి ఎక్కడానికి చాలా సార్లు ప్రయత్నించి విఫలమైంది. అది గమనించిన ఇంటి యజమాని.. అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. చిరుతను పట్టుకొని అడవిలో సురక్షితంగా విడిచిపెట్టారు. చిరుత వయసు దాదాపు ఐదేళ్లు ఉంటుందని తెలిపారు.