వింత ఆకారంలో మేకపిల్ల జననం- ఒకటే కన్నుతో.. - ఎర్నాకులంలో వింత ఆకారంలో మేకపిల్ల జననం
కేరళ ఎర్నాకుళం జిల్లాలో వింత ఆకారంలో మేకపిల్ల జన్మించింది. వెలియన్నూర్ పంచాయతీకి చెందిన థామస్ ఇంట్లో పుట్టిన ఈ మేకపిల్లకు ముక్కు, ఓ కన్ను లేదు. ముక్కు స్థానంలో ఒక రంధ్రం మాత్రమే ఉంది. దాని నుంచే ఆ మేకపిల్ల శ్వాస తీసుకుంటోంది. నుదురు, నాలుక ముందుకు పొడుచుకు వచ్చాయి. తల్లి మేక నుంచి పాలు తాగలేకపోవడం వల్ల బాటిల్‌ను ఉపయోగిస్తున్నట్టు యజమాని తెలిపారు. దాని అరుపులు మానవ శిశువును పోలి ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ మేకపిల్లను చూడటానికి జనం గుంపులుగా ఎగబడుతున్నారు.