Viral Video: టీకా ఇచ్చేందుకు.. పారే నదిని దాటి - వ్యాక్సినేషన్
జమ్ముకశ్మీర్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. డోర్ టు డోర్ డెలివరీ కార్యక్రమంలో భాగంగా.. అందరికీ టీకా వేసేందుకు వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాజౌరీ జిల్లా త్రల్లా గ్రామంలోని ప్రజలకు టీకా ఇచ్చేందుకు వైద్య సిబ్బంది నదిని దాటుకుంటూ వెళ్లారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.