పోలింగ్ కేంద్రంలో తుపాకీతో కాంగ్రెస్ అభ్యర్థి హల్చల్
ఝార్ఖండ్ శాసనసభ తొలిదశ పోలింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కేఎన్ త్రిపాఠి అత్యుత్సాహం ప్రదర్శించారు. పలాము జిల్లాలోని కోసియారా గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద భాజపా అభ్యర్థి అలోక్ చౌరాసియా, త్రిపాఠి మద్దతుదారుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో తన వద్ద ఉన్న తుపాకీ తీసి భాజపా కార్యకర్తలను బెదిరించారు త్రిపాఠి. పోలింగ్ బూత్‌కు వెళ్లకుండా వారిని అడ్డుకున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.