పైపుల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం - ప్లాస్టిక్ పైపుల తయారీ కర్మాగారంలో అగ్ని ప్రమాదం
పంజాబ్ జలంధర్ జిల్లాలోని ప్లాస్టిక్ పైపుల తయారీ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడగా.. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. దావానలాన్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.