దిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ వీడియో విడుదల - మర్కాజ్ వార్తలు
దేశంలో కరోనా వైరస్ కేసులు ఒకేసారి పెరగడానికి కారణంగా భావిస్తోన్న దిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ఘటనకు సంబంధించిన ఓ వీడియో విడుదలైంది. ఈ కార్యక్రమానికి హాజరైన చాలా మందికి వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. అయితే మార్చి 26న లాక్డౌన్ ఆదేశాలను ఉల్లంఘించి మర్కజ్ భవనంలో వేలమంది సమావేశమయ్యారు. వీరందరూ ఒకే చోట గుమిగూడటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.