'రూల్స్' పాటించమన్నందుకు డీలర్‌తో ఫైటింగ్ - ఇందోర్ న్యూస్ టుడే
మధ్యప్రదేశ్ ఇందోర్ కన్నడియా రోడ్లో.. కొవిడ్ నిబంధనల ఉల్లంఘన తీవ్ర ఘర్షణకు దారితీసింది. రేషన్ షాపు డీలర్‌కు స్థానికులకు మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. కరోనా రూల్స్ పాటించాలని అధికారులు చెప్పినప్పటికీ.. స్థానికులు ఎగబడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి.. బాటిల్ పట్టుకుని ఓ స్థానికుడు అధికారులపైకి వెళ్లాడు. అతనిని పట్టుకుని కొట్టారు ఆ అధికారులు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల వారిని సద్దుమణిగించారు.
Last Updated : Jun 15, 2021, 11:47 AM IST