'ఎన్కౌంటర్లతో న్యాయ వ్యవస్థ విశ్వసనీయతపైనే ప్రశ్నలు' - దుబే ఎన్కౌంటర్
భారత న్యాయ వ్యవస్థ.. లోపాలు సరిదిద్దుకునేందుకు స్వీయ పరిశీలన చేసుకోవాల్సిన అవసరముందని ప్రముఖ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన దుబే ఎన్కౌంటర్ను తప్పుబట్టారు. ఇలాంటి ఎన్కౌంటర్లు న్యాయ వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయని, ఇవి సమాజానికి మంచి సందేశాన్ని అందించవని పేర్కొన్నారు. చట్టాలు ఉన్నప్పుడు వాటిని అమలు చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. న్యాయ ప్రక్రియ సైతం వేగంగా ఉండాలని ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖిలో అభిప్రాయం వ్యక్తం చేశారు.