టీకా కోసం ఎగబడ్డ జనం.. ఎక్కడంటే? - కొవిడ్ టీకా కోసం
మధ్యప్రదేశ్‌లో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద.. భారీ రద్దీ నెలకొంటోంది. ధార్‌లోని ఒక టీకా కేంద్రంలోకి.. ఏమాత్రం కరోనా నిబంధనలు పాటించకుండా వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా ప్రజలంతా.. లోపలికి తోసుకుని వెళ్లటం వల్ల కొందరు కిందపడిపోయారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ వేస్తామని, భౌతిక దూరం, మాస్క్ వంటి నిబంధనలు పాటించకుండా రావటం మంచిదికాదని స్థానిక వైద్యాధికారులు విజ్ఞప్తి చేశారు.
Last Updated : Jul 20, 2021, 6:52 AM IST