రిపబ్లిక్ డే రోజు అంబేడ్కర్ విగ్రహం ముందే కాల్పులు - అంబేడ్కర్ విగ్రహం ముందే కాల్పులు
మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లాలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పలువురు హద్దుమీరి ప్రవర్తించారు. రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం ముందే తుపాకులను ఉపయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. మాతా బసయ్య పోలీసు స్టేషన్ ప్రాంతానికి చెందిన మాధవ్, కిషన్పుర్ సర్పంచ్ కమలేష్ పాఠక్, ఆమె భర్త బల్దౌ పాఠక్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాధవ్, బల్దౌ పాఠక్ సహా మొత్తం ముగ్గురు ఈ కాల్పులు జరిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాల్పులు జరపడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు.