కరోనా ఒత్తిడిని దూరం చేసే నృత్యం.. ట్రై చేశారా? - గుజరాత్ జామ్నగర్ న్యూస్
కరోనా నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు యోగాతో పాటు గార్బా నృత్యం కూడా అవసరం అంటోంది నేచర్ క్యూర్ అండ్ యోగా రీసెర్చ్ సెంటర్. ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో 800 మంది యోగా-గార్బా నృత్యం ప్రదర్శించారు. ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడికి ప్రకృతి వైద్యమే సహజ చికిత్స అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.