అహ్మదాబాద్: కన్నుల పండువగా జగన్నాథయాత్ర - కన్నులపండువ
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో జగన్నాథ రథయాత్ర కన్నులపండువగా సాగుతోంది. 18 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుంది. నగర వీధులన్నీ జనసంద్రంగా మారాయి. స్వామివారి రథయాత్రలో పాల్గొన్న వివిధ రకాల శకటాలు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి. వీర జవాన్ల వేషధారణలు, బుల్లెట్ రైలు నమూనా, సర్ధార్ వల్లభాయ్ పటేల్, శ్రీరాముని ప్రతిమలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.