వారణాసిలో వైభవంగా గంగా హారతి- ప్రధాని హాజరు - పీఎం మోదీ
Ganga Aarti Varanasi: ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో సోమవారం సాయంత్రం నిర్వహించిన గంగా హారతిలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎలక్ట్రిక్ వాహనంలో గంగా తీరానికి చేరుకున్న ప్రధాని.. స్వామి వివేకానంద క్రూయిజ్ షిప్లో గంగానదిలోకి వెళ్లి గంగా హారతిని తిలకించారు. 12 మంది భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉపముఖ్యమంత్రులు హాజరయ్యారు. గంగా హారతి సందర్భంగా శివ దీపోత్సవం నిర్వహించారు. దీపాల కాంతుల్లో గంగా ఘాట్ మెరిసిపోయింది.
Last Updated : Dec 13, 2021, 8:43 PM IST