భారీ అగ్ని ప్రమాదం- నింగినంటిన మంటలు - fire broke out in Sudarshan Company, Roha midc, raigad
మహారాష్ట్ర రాయ్గడ్ జిల్లా రోహలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక సుదర్శన్ రసాయన పరిశ్రమలో ఈ ఘటన జరిగింది. పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నింగికి అంటుతున్నాయా అనే రీతిలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. అకస్మాత్తుగా ఉవ్వెత్తున లేచిన మంటలను చూసి.. అక్కడే ఉన్న కార్మికులు, స్థానికులు పరుగులు తీశారు. గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద కారణాలు, ప్రాణనష్టం వంటి వివరాలు ఇంకా తెలియలేదు.