వైరల్: తోడేళ్ల గుంపుతో గజరాజు సరదా ఆట - CHENNAI
అది తమిళనాడు నీలగిరిలోని ముదుమలై జాతీయ పార్కు. రోజూ వందలాది పర్యటకులు అక్కడకు వెళ్తుంటారు. అడవిలో 900కు పైగా ఏనుగులుంటాయి. ఇంకా తోడేళ్లు, చిరుతలు, ఎలుగుబంట్లు సంచరిస్తుంటాయి. అయితే.. ఈ సోమవారం జరిగిన ఘటన అందరికీ వినోదాన్ని పంచింది. ఓ భారీ గజరాజు తోడేళ్ల గుంపును పరిగెత్తించింది. వాటిని అటూ ఇటూ తరిమికొట్టిన దృశ్యం... పర్యటకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిందీ ఏనుగు-తోడేళ్ల సరదా క్రీడ.
Last Updated : Sep 27, 2019, 3:55 PM IST