మితిమీరిన వేగం.. తీసిన నిండు ప్రాణం - ఈరోడ్
తమిళనాడు ఈరోడ్ నగరంలో గతరాత్రి తప్పతాగి కారు రేసులు పెట్టుకున్న కొందరు యువకులు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. అతివేగంగా కారు నడుపుతూ అదుపు తప్పి ఓ ఇంటి ముందు కాపలాదారుని ఢీకొట్టారు. ఆ ధాటికి బాధితుడు సుమారు 200 అడుగుల దూరం ఎగిరిపడి, అక్కడికక్కడే మరణించాడు. బాలమురగన్ అనే మరో వ్యక్తీ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.