ఫుల్‌గా తాగి నడిరోడ్డుపై మోడల్ వీరంగం.. - గ్వాలియర్‌లో మోడల్ మద్యం
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో.. ఫుల్‌గా మద్యం సేవించిన ఓ మోడల్.. నడిరోడ్డుపై హంగామా సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు అడ్డుపడుతూ.. వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగించింది. అంతేకాక అదేసమయంలో వెళ్తున్న ఆర్మీ జీప్‌ను కూడా అడ్డగించింది. జీప్ ముందు భాగాన్ని పదేపదే తన్నింది. దీంతో జీప్ హెడ్‌లైట్ పగిలిపోయింది. వెంటనే జీప్‌లోంచి దిగిన జవాను.. ఆమెను అడ్డుకునేందుక యత్నించగా.. అతడిని సైతం వెనక్కు నెట్టింది. ఈ ఘటన తెలుసుకున్న స్థానిక పోలీసులు.. మహిళా కానిస్టేబుల్ సహాయంతో యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన బుధవారం జరిగినట్టు తెలుస్తోంది.