'మద్యం తాగొద్దా? అయితే.. నాకు టీకా వద్దే వద్దు' - కరోనా టీకాకు భయపడ్డ వ్యక్తులు
Covid vaccine fear: దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కలవరపెడుతున్నప్పటికీ... వ్యాక్సిన్ వేసుకోవడానికి వివిధ కారణాలతో చాలా మంది వెనుకడగు వేస్తున్నారు. టీకా భయంతో ఓ వ్యక్తి చెట్టెక్కిన సంఘటన పుదుచ్చేరిలో జరిగింది. కోనేరికుప్పం గ్రామవాసులకు టీకా వేసేందుకు ఆరోగ్య సిబ్బంది రాగా.. 'నాకు టీకా వద్దంటే వద్దు' అంటూ ముత్తువేల్(39) అనే వ్యక్తి చెట్టెక్కి కూర్చున్నాడు. మద్యానికి బానిసైన అతడు.. టీకా వేసుకుంటే మద్యం తాగకూడదన్న భయంతోనే ఇలా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.