సైకత శిల్పంతో 'కరోనా జాగ్రత్తల'పై అవగాహన
దేశంలో మరోసారి కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. ఒడిశాలోని పూరి తీరంలో శైకత శిల్పంతో తనదైన శైలిలో అవగాహన కల్పించారు. మాస్కు తప్పనిసరిగా ధరించాలని, కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలని, వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.