నాలుగు అడుగుల పామును కక్కిన కోబ్రా - కోబ్రా నోట్లో మరో పాము
రోడ్డు పక్కన ఉన్న భారీ కోబ్రాను గుర్తించిన స్థానికులు పాముల సంరక్షకుడికి సమాచారం ఇచ్చారు. అతను కోబ్రాను పట్టుకోగా.. అది అప్పటికే మింగిన నాలుగు అడుగుల మరో పామును బయటకు కక్కింది. ఈ ఘటన తమిళనాడులోని కడలూరులో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.